VIDEO: మినీ ట్యాంక్ బండ్ నీటి దుర్వాసనతో ఇబ్బందులు

VIDEO: మినీ ట్యాంక్ బండ్ నీటి దుర్వాసనతో ఇబ్బందులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ నీరు బీకే రెడ్డి కాలనీ వద్ద దుర్వాసన వెదజల్లుతూ.. స్థానికులను ఇబ్బంది పెడుతోంది. పైకి స్వచ్ఛంగా కనిపించినా కాలుష్యంతో కంపు కొడుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్ట వెనుక భాగంలో అండర్ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.