విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక సూచనలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక సూచనలు చేసింది. 11 దేశాలకు చెందిన గగతలాలను ఉపయోగించొద్దని ఆదేశించింది. సౌదీ, ఒమన్, ఖతార్, కువైట్, ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ దేశాల గగనతలాలకు దూరంగా ఉండాలని సూచించింది. FL-320 కంటే తక్కువ ఎత్తులో విమానాలను నడపవద్దని పేర్కొంది.