VIDEO: బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రాజరాజేశ్వర స్వామి వారి భక్తులు మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.