సర్పంచ్ అభ్యర్థి మృతి.. డబ్బును తిరిగిచ్చేసిన ఓటర్లు..!
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన చెనగోని కాటంరాజు BRS మద్దతుతో పోటీ చేశారు. ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఎన్నికల్లో 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మనస్తాపంతో మరణించిన కాటంరాజు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పంచిన డబ్బులను పలువురు గ్రామస్థులు అతడి కుటుంబానికి తిరిగి ఇచ్చేశారు.