బాణసంచా కాల్చడం నిషేధం: సీవీ ఆనంద్

TG: జంటనగరాల్లో భద్రతా చర్యల దృష్ట్యా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పలు ఆంక్షలు విధించారు. కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధమని తెలిపారు. ఇది భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి కలిగిస్తుందని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి చర్యలు ప్రజల భద్రతకు హాని కలిగిస్తుందని వెల్లడించారు.