సీఎం రేవంత్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు: ఆర్టిస్ట్
HYD: CM రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం అద్భుతమైన చిత్రాలు వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. లంగర్‌హౌజ్‌కు చెందిన నరహరి అమీర్‌పేట్‌లోని ఓ స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. CM మీద ఉన్న అభిమానంతో ఆయన 55వ పుట్టిన రోజు సందర్భంగా 55 రోజుల పాటు 55 వస్తువులపై చిత్రాలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.