పలాస కిడ్నీ ఆసుపత్రిలో మొరాయించిన డయాలసిస్ మిషన్లు

శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో రోజుకు సుమారు 60 మంది వరకు కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా డయాలసిస్ మిషన్లు టెక్నికల్ విషయంలో మొరయించాయి. రోగులు తీవ్ర ఇబ్బంది పడడంతో.. స్పందించిన ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన ఇంజనీర్లను పిలిపించి మరమ్మత్తులో చేపట్టారు.