వివిధ పొలీస్ స్టేషన్లలో పట్టుబడిన గంజాయి దగ్ధం
MHBD: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 241 కిలోలు 956 గ్రాముల గంజాయి, 226 గ్రాముల హషీష్‌ను మహబూబాబాద్ పోలీసులు బుధవారం దగ్ధం చేశారు. ఈగల్ టీం ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించిన గంజాయి, హషీష్‌ను దగ్ధం చేయడం జరిగింది. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి దగ్దం చేశారు.