క్షణాల్లో నేలమట్టమైన IRGC ప్రధాన కార్యాలయం
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని IRGC ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ భారీ దాడిలో సమీపంలోని పలు భవనాలు కూడా కుప్పకూలాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సమాచారం. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ అధికారికంగా విడుదల చేసింది. క్షణాల వ్యవధిలోనే IRGC ప్రధాన కార్యాలయం నేలమట్టమైంది.