నేడు జిల్లాలో జాబ్ మేళా
కడప కలెక్టరేట్లోని ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇవాళ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. APSSDC జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ మేళాలో పలు కంపెనీలు హాజరవుతున్న నేపథ్యంలో 7వ తరగతి నుంచి పట్టభద్రుల వరకు అర్హత కలిగిన వారు పాల్గొనవచ్చు అన్నారు.