స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా, వ్యవసాయ అనుబంధ రంగాలు, పశుసంవర్ధక పథకాలు, నైపుణ్య అభివృద్ధి శిక్షణలు, పాడి గేదెల పథకాలకు ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాలు 2025-26 వార్షిక సంవత్సరానికి వర్తిస్తాయన్నారు.