అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
HNK: చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అంగన్వాడి సిబ్బందికి సూచించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కలెక్టర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి వస్తున్న చిన్నారుల సంఖ్యతో పాటు భోజనం ఎలా ఉంటుందని ఆరా తీశారు. చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు.