పుట్టపర్తిలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా పార్క్

పుట్టపర్తిలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా పార్క్

సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నది సమీపంలో ఏర్పాటు చేసిన 'జూయాలకాస్' పార్క్ రేపు అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొని ప్రారంభించనున్నారు. పర్యాటకులు, స్థానికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు వీలుగా ఈ పార్కును తీర్చిదిద్దారు. ఈ నూతన పార్క్ పట్టణానికే కొత్త ఆకర్షణగా నిలవనుంది.