రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

VZM: జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు.