రేపు అమరజీవి జయంతి వేడుకలు: కలెక్టర్
ATP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ విజన్ యూనిట్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.