మనుగడకు సైన్స్ ఎంతో ఉపయోగకరం: మున్సిపల్ ఛైర్మన్

సత్యసాయి: హిందూపురంలోని సరస్వతి విద్యా పీఠంలో రెండు రోజుల నుంచి ఏర్పాటు చేసిన సైన్స్ ఫెర్ ప్రదర్శన ముగిసింది. ఈ సైన్స్ ఫెర్ ముగింపు కార్యక్రమానికి సోమవారం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేష్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి సైన్స్ మూలమని, మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.