ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
KKD: కాకినాడ GGHలో చికిత్స పొందుతూ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతి చెందారు. ఉలిమేశ్వరానికి చెందిన ముత్తారావు (50) ఫిబ్రవరి 5న, పెద్దాపురం కొత్తపేటకు చెందిన రాయవరపు నేరెళ్ల బాబు (40) ఫిబ్రవరి 7న ఆర్థిక సమస్యలతో పురుగుమందు తాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చేసినట్లు ఎస్సై మౌనిక వెల్లడించారు.