శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
RR: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 76 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు రావాల్సిన 67 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన విమానాలు మొత్తం 143 ఇండిగో విమానాలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.