VIDEO: వీధి కుక్కల బెడద.. గ్రామస్థుల ఆందోళన
PLD: పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. సోమవారం రోజున కుక్కల సంచారం కారణంగా విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధుల్లో తిరిగే కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ, వాహనాలపై వెళ్లేవారిని కూడా వెంబడిస్తున్నాయి. పంచాయతీల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.