50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
KNR: మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ఆస్పత్రి నిర్మాణం పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల ఆరు పడకల స్థాయిని 50 పడకలకు పెంచేందుకు రూ. 17.50 కోట్ల మంజూరైనట్టు తెలిపారు.