UNSC హెచ్చరించినా తగ్గని ఇరాన్
గల్ఫ్ దేశాలపై దాడులను ఆపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్ వంటి దేశాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని, దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. మరోవైపు హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్ దాడులను ఖండిస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మానం చేసినా ఇరాన్ తగ్గట్లేదు. దీనితో గల్ఫ్ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది.