అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలకుచేయూత
VSP: మాజీ MLA వాసుపల్లి గణేశ్ కుమార్ అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించి భరోసానిచ్చారు. పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన సీనియర్ కార్యకర్త సిమ్మ పుష్ప, రాజేశ్ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం వారికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.