రైతు ఉత్సవాలపై మంత్రి తుమ్మల సమీక్ష
TG: పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించనున్నారు. మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. పంటల కొనుగోళ్లు, ఖరీఫ్‌నకు ఎలా సన్నద్ధం కావాలో వివరించనున్నారు. సాయిల్ హెల్త్ వాలంటీర్ల శిక్షణకు కొడంగల్ రైతులు ఇక్రిశాట్‌కు రానున్నందున మంత్రి రైతులతో సమాశమవుతారు.