రైలు ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం: మార్కాపురం మండలంలోని గుండాలపల్లి వద్ద సోమవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. అయితే మృతుడి యొక్క పూర్తి వివరాలు రైల్వే పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.