ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి
కృష్ణా: ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి జాతీయరహదారి పైనుంచి సర్వీసు రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.