అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
NLR: కందుకూరు మండలం మాచవరం సచివాలయం వద్ద ఆదివారం కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. క్రేన్ సహాయంతో ఆ కారును కాలువలో నుంచి బయటకు తీశారు. తెలంగాణకు చెందిన వీరు కందుకూరులో వివాహానికి హాజరై వింజమూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.