నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు

నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు

ప్రకాశం: పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో తాగునీటి కోసం మహిళలు కుస్తీ పడుతున్నారు. అసలే వేసవికాలం రోహిణి కార్తె కావడంతో గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా వచ్చే సాగర్ వాటర్ పైపుల వద్ద గంటల తరబడి నిలిస్తే బిందె నీరు దొరుకుతుందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.