'పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయండి'
W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.