రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

W.G: వాసవి పెనుగొండ నుంచి జీలం చెరువు వెళ్లే రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.36 లక్షల నిధులతో ఈ పనులు చేపడుతున్నామని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పితాని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.