ఆర్సీబీ గెలిచిందని రోజంతా FREE టీ

ఆర్సీబీ గెలిచిందని రోజంతా FREE టీ

JGL: మల్యాల ఎక్స్ రోడ్డులోని టీ షాప్ యజమాని రఘు ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలుపు వేడుకలను వినూత్నంగా జరిపాడు. బుధవారం తన టీ షాప్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీ పంపిణీ చేశాడు. '18 సంవత్సరాల కల నెరవేరింది.. థాంక్యూ ఆర్సీబీ' అంటూ హర్షం వ్యక్తం చేశాడు. కోహ్లి అభిమానిగా తాను స్థానికులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నానని చెప్పాడు.