భారత్‌పై ఐరాస ప్రశంసలు

భారత్‌పై ఐరాస ప్రశంసలు

శిశు మరణాల రేటును తగ్గించడంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఐరాస కితాబిచ్చింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల తగ్గింపుకు భారత్ కృషి చేస్తున్నట్లు కొనియాడింది. 2000 సంవత్సరంలో ప్రతి 100 మంది సజీవ జననాలకు 92గా ఉన్న మరణాల రేటు 2024 నాటికి 32కి తగ్గినట్లు తెలిపింది. నిమోనియా, అతిసారం, మలేరియా, పుట్టుకతో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో కృషి చేసిందని చెప్పింది.