సైబర్ నేరాలు రోడ్డు భద్రత మహిళా నేరాలపై అవగాహన

సైబర్ నేరాలు రోడ్డు భద్రత మహిళా నేరాలపై అవగాహన

CTR: చిత్తూరు జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పలు అంశాలపై పోలీసులు ఇవాళ అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు రోడ్డు భద్రత మహిళా నేరాలపై క్రైమ్ స్టేషన్ సీఐ ఉమామహేశ్వరరావు విద్యార్థులకు తెలియజేశారు. మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితం దుర్లభం అవుతుందని ఆయన వెల్లడించారు. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.