షమీని చంపేస్తామని బెదిరింపు మెయిల్

టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ.కోటి ఇవ్వకపోతే అతడిని చంపేస్తామని రాజ్‌పుత్ సింధార్ అనే వ్యక్తి మెయిల్ ద్వారా బెదిరించాడు. దీనిపై షమి సోదరుడు హసీబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.