అంగన్వాడీ యూనియన్ సీఐటీయూ నూతన కమిటీ ఎన్నిక

ASR: డుంబ్రిగూడ మండల అంగన్వాడీ యూనియన్ (CITU) నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ ఎన్నికలు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.పోతురాజు, అంగన్వాడీ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కె.కొండమ్మ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో టీ. సత్యవతి గౌరవాధ్యక్షురాలిగా, పాంగి రాధ అధ్యక్షురాలిగా, జీ. పవిత్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.