కాకినాడలో ఫిబ్రవరి 2న జాబ్ మేళా

కాకినాడలో ఫిబ్రవరి 2న జాబ్ మేళా

కాకినాడలో ఫిబ్రవరి 2న వికాస సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు శుక్రవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఆపై ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హతను బట్టి నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు వికాస కార్యాలయానికి సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.