ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

KRNR: నందవరం మండల పరిధిలోని ముగతి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మమ్మ దేవి దేవాలయ నిర్మాణానికి, గ్రామానికి చెందిన భీమరెడ్డి కుమారుడు రంగారెడ్డి గ్రామ పెద్దలకు లక్ష రూపాయల విరాళం అందజేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణంలో తన సహకారం ఉండడం ఆనందంగా ఉందని రంగారెడ్డి తెలిపారు. గతంలో సుంకలమ్మ దేవి ఆలయ నిర్మాణానికి కూడా ఆయన రూ. 2లక్షలు విరాళంగా ఇచ్చారు.