VIDEO: 'సంచార మెడికల్ ల్యాబ్' వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్
కోనసీమ: సంచార మెడికల్ ల్యాబ్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో దుర్గారావు దొర మాట్లాడుతూ.. మీ భద్రత మా బాధ్యత పేరుతో ఏర్పాటు చేసిన వాహనం గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ రోగుల నుంచి రక్త నమూనాల సేకరించి, పరీక్షల రిపోర్టులను అందిస్తారన్నారు. రోగులు ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదని తెలిపారు.