ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఇంఛార్జ్
ప్రకాశం: యర్రగొండపాలెంలోని జామియా మసీదు వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సోమవారం ప్రారంభించారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పేద మహిళల కోసం ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.