కాలనీలోకి వరద నీరు.. స్పందించని అధికారులు
SRPT: మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామంలో గల బీసీ కాలనీలోకి, పైన ఉన్న పొలాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నీరు చేరడం వల్ల విపరీతమైన దోమల వల్ల గ్రామ ప్రజలు నిత్యం అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ఎన్ని సార్లు అధికారులకు తెలియజేసిన స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.