ఉదయాన్నే ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు
ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే బదులు.. ఖాళీ కడుపుతో 2 ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. టిఫిన్‌కు ముందే ఖర్జూరాలు తింటే ఎనర్జీ లెవల్స్ సహజంగా పెరుగుతాయి. ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరాలలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.