మొబైల్ వ్యాపారులకు డీఎస్పీ సూచనలు

మొబైల్ వ్యాపారులకు డీఎస్పీ సూచనలు

ELR: చోరీ చేసిన మొబైల్స్ అమ్మకానికి వచ్చిన వారి వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచించారు. ఏలూరు నగరంలోని మొబైల్ అమ్మకపు దుకాణదారులతో శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొబైల్ కొనుగోలు చేసే సమయంలో ప్రతి ఒక్కరి వద్ద నుంచి ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.