ఎన్నికల ప్రచారం నిర్వహించిన గ్రామ నేతలు

ఎన్నికల ప్రచారం నిర్వహించిన గ్రామ నేతలు

పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపెల్లి మండలం పడకల్ గ్రామంలో బుధవారం నాడు గ్రామ నేతలు ప్రచారం చేపట్టారు. ఈ మేరకు రైతులు హమాలీలతో, ఉపాధి హామీ కూలీలతో కారు గుర్తు కు ఓటువేసి ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ కంది లావణ్య, గ్రామశాఖ అధ్యక్షులు మేకల అంజి గాధం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.