నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు
సత్యసాయి: కదిరి మండలంలో 53 లక్షల రూపాయల ప్రజాధనంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక పడమర కార్యాలయాల ప్రభుత్వ భవనం 2017లో ప్రారంభించారు. ఈ పడమర కార్యాలయం ఓడీసీలో ఏర్పాటు చేయడంతో ఈ భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతోంది. ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనం వృథాగా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.