నాయుడుపేటలో తృటిలో తప్పిన ప్రమాదం

NLR: నాయుడుపేటలో శుక్రవారం రాత్రి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద వెంకటగిరి వైపు నుంచి వస్తున్న ఓ వాహనం ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడబోయింది. డ్రైవర్ చాకచక్యంతో బ్రిడ్జ్ మీద ఉన్న స్తంభాలను ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ ఏర్పడింది.