'రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ పనిచేయాలి'

KMM: రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ పనిచేయాలని DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తెలిపారు. బుధవారం ఖమ్మం సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న యువజన, ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలకు డివైఎఫ్ఐ సిద్ధం అవుతుందని చెప్పారు. 31న మంచికంటి భవన్ లో డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు జరుగుతుందన్నారు.