VIDEO: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
GNTR: పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. అబ్బినేనిగుంటపాలెం నుంచి గొట్టిపాడు వెళ్లే మార్గంలో ఓ చెరువు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కింద పడిన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.