'మంగళగిరి ఆడపడుచులు నా అక్కాచెల్లెల్లు'

GNTR: తనకు సొంతంగా అక్కాచెల్లెళ్లు లేరని, మంగళగిరి మహిళలే తన అక్కాచెల్లెళ్లని మంత్రి లోకేష్ అన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన మంగళగిరి మహిళలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.