చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప.గో: జీలుగుమిల్లి బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సీఎం సహాయ నిధి చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 100 చెక్కులను పంపిణీ చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలను కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.