ఉత్సాహంగా పవన్ నివాసంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం
కాకినాడ: జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో రాష్ట్రానికి పిఠాపురం నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పేర్కొన్నారు. చేబ్రోలు గ్రామంలో ఉన్న Dy. Cm పవన్ నివాసంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓదూరి కిషోర్, ఓదూరి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది.