కామారెడ్డిలో జనసేన పార్టీ అభ్యర్థి నామినేషన్
KMR: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని ఎనిమిదవ వార్డ్, జనసేన పార్టీ అభ్యర్థిగా లక్ష్మీ నరస గౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్క మల్లేశం తదితరులు పాల్గొన్నారు.